వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.

తిరువూరు:-- గంపల గూడెం మండలం తునికిపాడు గ్రామంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం నిర్వహించారు

ఈ వైద్య శిబిరానికి తునికిపాడు గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల బృందం ప్రతి రోగిని క్షుణ్ణంగా పరీక్షించి తగిన వైద్య సలహాలు అందించారు. ఈ శిబిరంలో 2D ఎకో , ఈసిజి, స్కానింగ్, రక్త పరీక్షలు రక్తపోటు, మధుమేహం తదితర ఆరోగ్య పరీక్షలను పూర్తి ఉచితంగా నిర్వహించారు. అనంతరం అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆసుపత్రులకు వెళ్లలేని అనేక మంది ఈ శిబిరం ద్వారా ప్రయోజనం పొందారు. ఈ సందర్భంగా తునికిపాడు గ్రామ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించిన గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అలాగే సేవా దృక్పథంతో సహకరించిన సుజనా ఫౌండేషన్ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యమనే సంకల్పంతో భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.