మొదటి షోల నుంచే మంచి స్పందన.. అఖిల్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు
లెనిన్' సినిమాపై తొలి స్పందనలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. అఖిల్–భాగ్యశ్రీ బోర్సే జంట మధ్య కెమిస్ట్రీ బాగుందని, ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అఖిల్ నటనలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని, ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.